ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జవాన్లకు గాయాలు

by Gantepaka Srikanth |

ఛత్తీస్‌గఢ్‌‌(Chhattisgarh)లోని బీజాపూర్‌ దండకారణ్యంలో మరోసారి కాల్పుల మోత మోగింది. మంగళవారం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌(Encounter) జరిగింది.

ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జవాన్లకు గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌‌(Chhattisgarh)లోని బీజాపూర్‌ దండకారణ్యంలో మరోసారి కాల్పుల మోత మోగింది. మంగళవారం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌(Encounter) జరిగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఇంకా కూంబింగ్ కొనసాగుతున్నట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, వర్షాకాలంలోనూ మావోయిస్టు ఏరివేత ఆపరేషన్లు కొనసాగిస్తామని ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయుధాలు వీడి, అభివృద్ధి పథంలో కలిసి రావాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్‌ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింత ముందుకెళ్తామని అమిత్‌ షా పేర్కొన్నారు.

Next Story