- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు నిందితులు అరెస్ట్
తెలంగాణ (Talangana)లో డ్రగ్స్ నిర్మూలనకు టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఎస్‌ఓటీ (SOT), ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Talangana)లో డ్రగ్స్ నిర్మూలనకు టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఎస్‌ఓటీ (SOT), ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు (Railway Stations), ఎయిర్‌పోర్టు (Airports)లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ ఎక్కడికక్కడ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ నగరంలోని ధూల్‌పేట్ (Dhoolpet)లో నిషేధిత డ్రగ్స్ అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున గంజాయితో పాటు LSD, MDMA లాంటి నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మూడు మొబైల్ ఫోన్లకు కూడా సీజ్ చేశారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం ఎక్సైజ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.






