- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మసీదులో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు
by Ajay Maddhiboyina |
ఇండోనేషియాలోని జకార్తలో భారీ పేలుడు సంభవించింది. ఓ పాఠశాల సముదాయం లోపల ఉన్న మసీదులో పేలుడు సంభవించించగా 54 మంది గాయపడ్డారు. శుక్రవారం కావడంతో చాలా మంది ప్రార్థనలో ఉన్న సమయంలో బ్లాస్ట్ జరగటంతో నష్టం వాటిల్లింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఇండోనేషియాలోని జకార్తలో భారీ పేలుడు సంభవించింది. ఓ పాఠశాల సముదాయం లోపల ఉన్న మసీదులో పేలుడు సంభవించించగా 54 మంది గాయపడ్డారు. శుక్రవారం కావడంతో చాలా మంది ప్రార్థనలో ఉన్న సమయంలో బ్లాస్ట్ జరగటంతో నష్టం వాటిల్లింది. బాధితుల్లో చాలా మందికి గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. కొందరు తీవ్రంగా గాయపడగా మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. జకార్తా పోలీస్ చీఫ్ అసెప్ ఎడి సుహెరి ప్రకారం.. మసీదు లౌడ్ స్పీకర్ నుండి పేలుడు సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం గానీ, పెద్దగా ఆస్తినష్టంగానీ జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Next Story






