భర్త వేధింపులకు వివాహిత బలి

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో విషాద ఘటన వెలుగుచూసింది.

భర్త వేధింపులకు వివాహిత బలి
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విషాద ఘటన వెలుగు చూసింది. భర్త వేధింపులు తాళలేక తూర్పుగోదావరి జిల్లా మండపేటలో భారతి(25) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురానికి చెందిన భారత(25), మండపేటలో సైదిలుపేటకు చెందిన శ్రీనివాసరావు ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దలను ఒప్పించి 2019లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

పెళ్లైన కొన్నాళ్ల నుంచి శ్రీనివాసరావు తాగుడుకు బానిసై మద్యం మత్తులో భార్యను వేధించేవాడు. మద్యానికి బానిసైన భర్త శ్రీనివాసరావు శారీరకంగా, మానసిక వేధింపులకు గురి చేయడంతో ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. భార్య మరణం తర్వాత భర్త కూడా రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేయగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పండగపూట అప్యాయంగా గోరుముద్దలు తినిపించిన తల్లి మృత్యుఒడికి చేరడంతో ఇద్దరు చిన్నారులు విలపిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

Next Story