- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహిత ఆత్మహత్య.. జీవితం మీద విరక్తితో ఉరి
వితంపై విరక్తి కలిగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, చైతన్యపురి : జీవితంపై విరక్తి కలిగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బోడలదీన్నే గ్రామానికి చెందిన మల్గిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మమత(35) దంపతులు తన కుమార్తెతో కలిసి మనసురాబాద్ లోని ఆదిత్య నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. శ్రీనివాస రెడ్డి కారు డ్రైవర్ గా పనిచేస్తుండగా మమత కూరగాయల వ్యాపారం చేస్తుండేది.
జూన్ 25 న సాయంత్రం 6 గంటల తర్వాత మమత తన పని ముగించుకుని ఇంటికి చేరింది. మనస్థాపానికి గురై జీవితంపై విరక్తి చెంది తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తనకు పరిచయం ఉన్న వ్యక్తి కందుకూరి సురేష్ కు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే సురేష్ మమత నివాసానికి చేరుకొని అదే ఇంట్లో నివాసం ఉండే కె. నరేష్ సహాయంతో తలుపులు తెరిచి చూడగా చీరతో ఫ్యానుకు ఉరేసుకొని కనబడింది.
వెంటనే కిందకు దించి భర్తకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం పక్కనే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం డాక్టర్ల సూచన మేరకు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జూన్ 29 సాయంత్రం మమత మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.






