మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

by Ratna Kumari |

దిశ‌, మ‌ద‌నాపురం : మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. మదనాపురం

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
X

దిశ‌, మ‌ద‌నాపురం : మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. మదనాపురం ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అజ్జకొల్లు గ్రామానికి చెందిన సంకరి అంజలి (24), భ‌ర్త అశోక్ దంప‌తులు. వీరికి 10నెల‌ల కుమారుడితో క‌లిసి గ్రామంలో నివాసం ఉంటున్నారు. గురువారం ఉద‌యం భార్య‌, భ‌ర్త‌లు గొడ‌వ ప‌డ్డారు. దీంతో మనస్తాపానికి గురైన అంజ‌లి ఇంట్లో ఎవరు లేని సమయం అంజలి బాత్రూంలోఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు తండ్రి కిష్టయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story