బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసు.. నేడు సీఐడీ విచారణకు మంచు లక్ష్మి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-22 06:18:47  IST  )

టాలీవుడ్ నటి మంచు లక్ష్మి నేేడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న మంచు లక్ష్మి ఈ రోజు మధ్యాహ్నం సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరవుతారు.

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసు.. నేడు సీఐడీ విచారణకు మంచు లక్ష్మి
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి మంచు లక్ష్మి నేేడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న మంచు లక్ష్మి ఈ రోజు మధ్యాహ్నం సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరవుతారు. ఇక నిన్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులోనే హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, నటి అమృత చౌద‌రి సైతం సీఐడీ విచారణకు హాజరయ్యారు.

బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్స్ కోసం జ‌రిగిన లావాదేవీలపై వీరిని అధికారులు ప్ర‌శ్నించారు. మ‌రోవైపు ఈ కేసులో ఇప్ప‌టికే టాలీవుడ్ హీరో రానా, నటుడు ప్ర‌కాష్ రాజ్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, విష్ణుప్రియ సైతం సీఐడీ విచార‌ణ ఎదుర్కొన్నారు. విచార‌ణ‌లో బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్ర‌మోట్ చేశారు. ప్ర‌మోష‌న్స్ కోసం ఎంత తీసుకున్నారు. యాప్ నిర్వాహ‌కుల‌తో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు లాంటి విష‌యాల‌పై అధికారులు ఆరా తీశారు.

Next Story