కన్నకూతురిపై కీచక తండ్రి దారుణం.. కడుపుచేసి, పసికందును కూడా..

by Naga Rani Yarlagadda |

తన కామ వాంఛకు కన్న కూతురి జీవితాన్ని బలిచేశాడో కీచక తండ్రి. ఆమె గర్భం దాల్చగా.. పుట్టిన బిడ్డను కూడా వదల్లేదు. ఈ దారుణ ఘటన..

కన్నకూతురిపై కీచక తండ్రి దారుణం.. కడుపుచేసి, పసికందును కూడా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆడపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. అనుక్షణం రక్షణగా ఉండాల్సిన తండ్రులే వారి పాలిట కీచకులుగా మారుతున్నారు. వావి వరుసలు మరిచిపోయి తమ కామ కోరికలకు బలి చేస్తున్నారు. అలాంటి దారుణ ఘటన తాజాగా మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. ఖర్గోన్ జిల్లాలో ఓ తండ్రి తన 16 ఏళ్ల కూతురిపై కామ వాంఛ తీర్చుకునేందుకు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చగా.. పుట్టిన బిడ్డను ముళ్ల పొదల్లో విసిరేసి పరారయ్యాడు ఆ దుర్మార్గుడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ముళ్ల పొదల్లో ఓ పసికందు గుక్కపెట్టి ఏడుస్తుండటాన్ని గ్రామస్తులు గమనించారు. శరీరమంతా చీమలదండుతో నిండి ఉన్న ఆ శిశువుని రక్షించి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే శిశువుని స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఆపై బీఎన్ఎస్ సెక్షన్ 93 ప్రకారం కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో శిశువు తల్లి 16 ఏళ్ల బాలిక అని, ఆమెను ఓ క్లినిక్ లో చేర్చారని తెలుసుకున్న ఎస్పీ ధర్మరాజ్ మీనా.. బాధితురాలిని కలిసి ఎంక్వైరీ చేయగా అసలు విషయం బయటపడింది.

గుజరాత్ లోని రాజ్ కోట్ లో కూలీ పనులు చేసుకుంటుండగా తనపై తండ్రి అత్యాచారం చేశాడని, ఫలితంగా తాను గర్భవతిని అయ్యానని తెలిపింది. ఇంట్లోనే ప్రసవం అవ్వగా.. తాను స్పృహ కోల్పోయాక పసికందును ఎత్తుకెళ్లి ముళ్లపొదల్లో పారేసి పరారయ్యాడని తెలిపింది. బాధితురాలి వాంగ్మూలంతో పోలీసులు ఆమె తండ్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుల్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం శిశువు వెంటిలేటర్ పై ఉందని, ముగ్గురి నుంచి శాంపుల్స్ సేకరించి డీఎన్ఏ పరీక్షలకు పంపినట్లు ఎస్పీ తెలిపారు.

Next Story