- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లింగన్నపేటలో వ్యక్తి దారుణ హత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో వ్యక్తి హత్యకు గురైన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

X
దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో వ్యక్తి హత్యకు గురైన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మండే సతీష్(32) అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. బీరు ఖాళీ సీసాలతో సతీష్ ను హత్య చేసినట్లు తెలుస్తుంది. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో వ్యక్తి అక్కడికక్కడే సంఘటన స్థలంలో మృతి చెందాడు.
గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎల్లారెడ్డిపేట సిఐ శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎస్సై ప్రేమానందం సంఘటన స్థలానికి వెళ్లి జరిగిన సంఘటనను పరిశీలించారు. హత్యకు దారి తీసిన పూర్తి సమాచారం తెలియాల్సింది. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం.
Next Story






