- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెను విషాదం.. భార్య, పిల్లల్ని చంపి వ్యక్తి ఆత్మహత్య !
శనివారం సాయంత్రం వరకూ ఆ ఇంటి తలుపులు తెరవకపోవడంతో పొరుగింటి వారు కిటికీలోంచి తొంగిచూశారు. కుటుంబమంతా శవాలుగా పడి ఉండటంతో ఉలిక్కిపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత చికాకులు.. ఇలాంటి కారణాలతో పిల్లలతో సహా తల్లిదండ్రులు చనిపోతున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లల్ని దారుణంగా చంపి.. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. కస్‌గంజ్ జిల్లా అమాన్‌పూర్ పట్టణంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ఐదుగురు కుటుంబ సభ్యులు విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శనివారం సాయంత్రం వరకు ఆ ఇంటి తలుపులు తీయకపోవడాన్ని గమనించిన పొరుగువారు అనుమానంతో కిటికీ గుండా చూడగా.. శ్యామ్‌వీర్ సింగ్ (50) ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్యామ్‌వీర్‌తో పాటు అతని భార్య రామశ్రీ (46), కుమార్తెలు ప్రాచి (14), ఆకాంక్ష (12), కుమారుడు గిరీష్ (10) అదే ఇంట్లో నివసిస్తున్నారు. శనివారం (ఫిబ్రవరి 21) సాయంత్ర అయినా వారు ఇంటి నుంచి బయటికి రాకపోకపోవడంతో పొరుగింటివారు కిటికీలోంచి తొంగి చూడగా.. మృతదేహాలు కనిపించాయి. స్థానికుల సమాచారంతో సాయంత్రం 6.30 గంటలకు అక్కడికి వెళ్లిన పోలీసులు.. వెల్డింగ్ మిషన్ సహాయంతో తలుపులు కట్ చేసి లోపలికి వెళ్లారు. గదిలో శ్యామ్‌వీర్ ఉరివేసుకుని ఉండగా, భార్య రామశ్రీ , ముగ్గురు పిల్లలు కింద పడి మరణించి ఉన్నారు. ఎస్పీ అంకితా శర్మ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కస్‌గంజ్ ఎస్పీ అంకితా శర్మ మాట్లాడుతూ.. "ఇంటికి ఉన్న ముందు, వెనుక తలుపులు రెండూ లోపల నుంచే లాక్ చేసి ఉన్నాయి. బయటి వ్యక్తులు లోపలికి వచ్చిన ఆనవాళ్లు లేవు. ప్రాథమిక సమాచారం ప్రకారం, శ్యామ్‌వీర్ తన భార్య, పిల్లలను చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నాం. భార్య రామశ్రీ మెడపై గాయాలు ఉన్నాయి. పిల్లల శరీరాలపై మాత్రం ఎలాంటి బాహ్య గాయాలు లేవు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు పంపాం. నివేదిక వచ్చాకే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయి" అని పేర్కొన్నారు.
కాగా.. కొద్దిరోజుల క్రితమే మధురలో ఒక వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలను చంపి కరెంట్ షాక్ తో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మరువకముందే.. అమాన్ పూర్లోనూ అదే తరహా ఘటన జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.






