ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్య‌క్తి మృతి

by Ratna Kumari |

ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్య‌క్తి మృతి
X

దిశ, ఎల్లారెడ్డిపేట : ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఎల్లారెడ్డి పేట మండ‌లం దుమాల గ్రామానికి చెందిన అనంత‌య్య‌(75) ద్విచ‌క్ర వాహ‌నం పై వెళ్తుండ‌గా.. వెనుక వైపు నుంచి ఎల‌క్ట్రానిక‌ల్ బ‌స్సు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో అనంత‌య్య తల ప‌గిలి కుడికాలు నుజ్జు నుజ్జయి ర‌క్త స్రావం జ‌రిగింది. ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతూ కొన ఊపిరిలో ఉన్న అత‌న్ని స్థానికులు 108లో మండ‌ల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించే లోపే మృతి చెందిన‌ట్టు పేర్కొన్నారు.

Next Story