ఉరేసుకొని వ్యక్తి మృతి

by Ratna Kumari |

ఉరేసుకొని వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది.

ఉరేసుకొని వ్యక్తి మృతి
X

దిశ, నిడమనూరు : ఉరేసుకొని వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండల కేంద్రానికి చెందిన పసుపు లేటి కొండల్ (40) హాలియా లో టిఫిన్ సెంటర్ నడుపుతూ.. వ్యాపారం కోసం అప్పులు చేసి తీర్చలేక మంగళవారం ఇంట్లో పై కప్పుకు ఉన్న ఇనుప రాడ్డు కు చీరె తో ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. భార్య రమణ ఇచ్చిన పిర్యాదు మేరకు మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి.. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఉప్పు సురేష్ తెలిపారు.

Next Story