- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి మృతి
by Ratna Kumari |
దిశ, మక్తల్ : రైలు కింద పడి చనిపోతానని చెప్పి మరీ ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్తల్ మండల పరిధిలోని జక్లెర్ గ్రామానికి

X
దిశ, మక్తల్ : రైలు కింద పడి చనిపోతానని చెప్పి మరీ ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్తల్ మండల పరిధిలోని జక్లెర్ గ్రామానికి చెందిన కుర్వ మల్లేష్ (35) మతి స్థిమితం సరిగ్గా లేదు. ఇప్పటికే రెండు మూడు సార్లు రైలు కింద పడి చనిపోతానని చెప్పాడు. ఎప్పటి మాదిరిగానే ఇవాళ కూడా నాకు జీవితం పై విరక్తి కలిగిందని.. నేను చనిపోతానని చెప్పాడు. ఎప్పుడు ఇలాగే అంటాడు.. కాబట్టి ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ఇవాళ గూడ్స్ రైలు కింద పడటంతో శరీరం రెండు ముక్కలు అయింది. చనిపోతానని చెప్పి.. అన్నంత పని చేసుకున్నాడని స్థానికులు పేర్కొన్నారు. మృతునికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
Next Story






