- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గడ్డి మందు తాగి వ్యక్తి మృతి
దిశ, వీపనగండ్ల : గడ్డి మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. SI కే.రాణి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తూంకుంట గ్రామానికి చెందిన

దిశ, వీపనగండ్ల : గడ్డి మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ కే.రాణి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తూంకుంట గ్రామానికి చెందిన మంగదొడ్డి వెంకటేశ్వర్వు(55), తీవ్ర కాలు నొప్పి ఉండేది. నొప్పిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం వెంకటేశ్వర్లు కాలుకి గాయం అయింది. అది సెప్టిక్ గా మారింది. అప్పటి నుంచి తీవ్ర నొప్పితో బాధ పడుతున్నాడు. చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మాత్రం కుదుట పడటం లేదు. దీంతో నిరాశకు గురై కాలు నొప్పి భరించలేక మంగళవారం ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు పరిస్తితి విషమంగా ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.






