5 ఫుల్ బాటిల్స్ తాగి యువకుడు మృతి

by Ajay Maddhiboyina |

తాగడం అంటే ఉల్లాసం కోసం తాగాలి, ఉద్యమంలా తాగకూడదు ఇది ఓ సినిమా డైలాగ్. నిజానికి మద్యాపానం ఆరోగ్యానికి హానికరం కాబట్టి దానికి దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది.

5 ఫుల్ బాటిల్స్ తాగి యువకుడు మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: తాగడం అంటే ఉల్లాసం కోసం తాగాలి, ఉద్యమంలా తాగకూడదు ఇది ఓ సినిమా డైలాగ్. నిజానికి మద్యాపానం ఆరోగ్యానికి హానికరం కాబట్టి దానికి దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది. కొందరు అలవాటు పడిన వారు, కష్టజీవులు అప్పుడప్పుడు తాగటం కామన్. అయితే దానికి కూడా లిమిట్ ఉండాలి లేదంటే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి. తాజాగా ఓ యువకుడికి అలాంటి పరిస్థితే వచ్చింది. కర్నాటకలోని కోలార్ జిల్లా నన్‌గళ్లి పీఎస్ పరిధిలో ఓ యువకుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఫుల్ బాటిల్స్ మద్యాన్ని ఒకేరోజు తాగేశాడు.

అది కూడా రా కావడంతో తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి పేరు కార్తీక్ కాగా స్నేహితుల‌తో వేసిన రూ.10 వేల పందెం కోసమే ఇలా ఐదు ఫుల్ బాటిల్స్ మ‌ద్యం తాగిన‌ట్టు తెలుస్తోంది. తాగిన త‌ర‌వాత తీవ్ర అనారోగ్యం పాల‌వ్వ‌డంతో కార్తీన్ ను ఆస్ప‌త్రితో చేర్పించ‌గా ప‌రిస్థితి విష‌మించి చనిపోన‌ట్టు కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. కార్తీక్ కు గ‌తేడాది వివాహం జ‌ర‌గ్గా 8రోజుల క్రిత‌మే అత‌డి భార్య బిడ్డ‌కు జ‌న్మనిచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు అత‌డితో పందెం కాసిన ఇద్ద‌రు స్నేహితుల‌ను అరెస్ట్ చేయ‌గా మ‌రో న‌లుగురు ప‌రారీలో ఉన్నట్టు తెలిపారు.

Next Story