- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసుపత్రి లో గుండెపోటు తో వ్యక్తి మృతి.
దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రికి మంగళవారం రాత్రి బోథ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ యాకుబ్ అలీ వైద్యం కోసం ఆసుపత్రి

దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రికి మంగళవారం రాత్రి బోథ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ యాకుబ్ అలీ వైద్యం కోసం ఆసుపత్రి కి వెళ్లగా.. సరైన వైద్యం అందక మృతి చెందినట్లు మృతుడి కుటుంబికులు బుధవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. మంగళవారం రాత్రి శ్వాస ఆడకపోవడం తో ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్లామని అన్నారు. అయితే ఆసుపత్రి కి చేరుకున్న తరువాత వైద్య సిబ్బంది ఇంజక్షన్ లు,టాబ్లెట్ లు పేషెంట్ కు ఇచ్చారని అన్నారు.పేషెంట్ పరిస్థితి విషమించడం తో ఆసుపత్రి లో వైద్యం చేస్తుండగానే మృతి చెందాడు. మృతుడి కుటుంబికులు మాట్లాడుతూ ఆసుపత్రి లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం గా వ్యవహారిస్తున్నారని, వైద్య సేవలు ఆశించిన స్థాయిలో జరుగడం లేదని మృతుడి కుటుంబికులు వాపోయారు. అయితే ఈ విషయం పై డ్యూటీ లో ఉన్న డాక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి కి వచ్చిన పేషెంట్ కు తమతో అయినంత మేర వైద్యం చేశామని హార్ట్ స్ట్రోక్ రావడం తో పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రి లో సమస్యలు పరిష్కరించాలని ఏమ్మెల్యే కు వినతి.
ఆసుపత్రి లో వైద్య పరికరాలు అందుబాటులో లేవని, ఆసుపత్రి కి అంబులెన్సు సౌకర్యం కల్పించాలని, ఈసీజీ పరికరం పేపర్ లు కూడా లేవని, పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించి తొందరగా ఆసుపత్రి సమస్యలు పరిష్కరించాలని మాసం వెల్ఫేర్ సొసైటీ సభ్యులు బుధవారం బోథ్ ఏమ్మెల్యే అనిల్ జాదవ్ కు వినతి పత్రం అందించారు.






