- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యానికి బానిసై వ్యక్తి మృతి
మద్యానికి బానిసై వ్యక్తి మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని ఇంద్రియాల గ్రామంలో చోటుచేసుకుంది.

దిశ,భూదాన్ పోచంపల్లి : మద్యానికి బానిసై వ్యక్తి మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని ఇంద్రియాల గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మర్రికుంట తండాకు చెందిన ధరావత్ ప్రభాకర్ (52) ఎలక్ట్రిషన్ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసై ఈనెల 2న ప్రభాకర్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ నేపధ్యంలో తన ఇంటి ముందు ఉన్న పాడుబడిన ఇంట్లో వెతికి చూడగా శవమై ప్రత్యక్షమయ్యాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య దరావత్ రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు. మృతుడికి భార్యతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు.






