- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఏ పరీక్షల్లో ఫెయిల్.. హీలియం గ్యాస్ పీల్చి యువకుడి ఆత్మహత్య
సీఏ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని ఓ యువకుడు హీలియం గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. కొబ్బరితోట ఏరియాకు చెందిన అఖిల్ వెంకట కృష్ణ అనే యువకుడు ఇటీవల సీఏ పరీక్షలు రాశాడు. కానీ ఫలితాలు ఆశించినట్టుగా రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దిశ, వెబ్ డెస్క్: సీఏ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని ఓ యువకుడు హీలియం గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. కొబ్బరితోట ఏరియాకు చెందిన అఖిల్ వెంకట కృష్ణ అనే యువకుడు ఇటీవల సీఏ పరీక్షలు రాశాడు. కానీ ఫలితాలు ఆశించినట్టుగా రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునేందుకు అఖిల్ వెంకట కృష్ణ ఓ గదిని సైతం అద్దెకు తీసుకున్నాడు.
అందులో హీలియం గ్యాస్ సిలిండర్ అమర్చి ముఖానికి కవర్ కట్టుకుని గ్యాస్ పీల్చి చనిపోయాడు. వాసన బయటకు రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడు అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు. చనిపోయే ముందు అతడు సూసైడ్ నోట్ రాశాడు. అందులో తన తల్లిదండ్రులను మోసం చేశానని, తనకు బతికే అర్హత లేదని చెప్పాడు. తమ కొడుకు ఇంట్లో గుంటూరు వెళ్ళి వస్తానని చెప్పాడని, ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోలేని తల్లిదండ్రులు కన్నీరుమన్నీరవుతున్నారు.






