హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. ఒకరితో బిడ్డ, మరొకరితో పెళ్లి.. ప్రియుడు ఆత్మహత్య

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-15 09:14:19  IST  )

హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ గ్రామంలో నివాసం ఉండే పల్లపు గోవర్ధన్ అనే యువకుడు, సరిత అనే యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. ఒకరితో బిడ్డ, మరొకరితో పెళ్లి.. ప్రియుడు ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ గ్రామంలో నివాసం ఉండే పల్లపు గోవర్ధన్ అనే యువకుడు, సరిత అనే యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో తెలియకుండానే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోగా వీరికి ఓ బిడ్డ జన్మించింది. అయితే ఆ బిడ్డను అమ్మేసిన సరిత మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. విషయం గోవర్దన్‌కు తెలియడంతో ఎన్నిసార్లు బతిమాలినా అతడితో వెళ్లేందుకు సరిత నిరాకరించింది. ఈ క్రమంలో తీవ్రమనోవేదనకు గురైన గోవర్ధన్ మంగళవారం నైట్ డ్యూటీ ముగించుకుని మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చి డోర్ పెట్టుకున్నాడు.

సాయంత్రమైనా తన సోదరుడు బయటకు రాకపోవడంతో గోవర్దన్ సోదరి తలుపులు పగలగొట్టి చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. వెంటనే చుట్టుపక్కలవారిని పిలవగా అప్పటికే బాధితుడు మరణించినట్టు వారు నిర్దారించారు. గోవర్ధన్ వద్ద ఓ సూసైడ్ నోట్ దొరకగా తన చావుకు తన భార్యే కారణం అని పేర్కొన్నాడు. విషయం మొత్తం ఫోన్ లో రికార్డ్ చేశానని, ఫోన్ పాస్ వర్క్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సరిత బిడ్డను అమ్మేసిన తరవాత మరో పెళ్లికి సిద్ధం అవ్వగా పెళ్లి పనులు కూడా గోవర్ధన్ తోనే చేయించుకోవడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అమ్మేసిన బిడ్డ ఆచూకీ ఇప్పటి వరకు తెలియదని చెబుతున్నారు.

Next Story