బాలకృష్ణ, ప్రభాస్ చెప్పడంవల్లే బెట్టింగ్ ఆడాను.. టవర్ ఎక్కి యువకుడి ఆందోళన

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-05 11:16:44  IST  )

బెట్టింగ్ వల్ల నష్టపోయిన ఓ యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మల్కాపురం గ్రామంలో చోటు చేసుకుంది.

బాలకృష్ణ, ప్రభాస్ చెప్పడంవల్లే బెట్టింగ్ ఆడాను.. టవర్ ఎక్కి యువకుడి ఆందోళన
X

దిశ‌, వెబ్ డెస్క్: బెట్టింగ్ యాప్‌లకు బానిసై చాలా మంది లక్షలు, కోట్లలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సరదాగా మొదలైన ఆట చివరికి అప్పుల పాలు చేసి ఆత్మహత్యలకు దారితీస్తోంది. ఏదో అవగాహనలేని వారో చదువు రానివాళ్లో బెట్టింగ్ ఆడుతున్నారనుకుంటే పొరపాటే. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు, ఉన్నత విద్యావంతులు సైతం బెట్టింగ్ బూతానికి బలవుతున్నారు. ఇక తాజాగా బెట్టింగ్ వల్ల నష్టపోయిన ఓ యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మల్కాపురం గ్రామంలో చోటు చేసుకుంది.

బెట్టింగ్ యాప్ వల్ల రాంబాబు అనే యువకుడు రూ.80 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో గ్రామంలోని టవర్ ఎక్కి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని హల్ చల్ చేశాడు. బాలకృష్ణ‌, అల్లు అర్జున్, ప్ర‌భాస్ లాంటి సెల‌బ్రెటీలు బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోట్ చేయ‌డం వ‌ల్ల‌నే రూ.60 ల‌క్ష‌లు అప్పు చేసి మ‌రీ ఆన్లైన్ బెట్టింగ్ పెట్టిన‌ట్టు రాంబాబు వెల్లడించాడు. అప్పులు తీర్చేందుకు తాను కిడ్ని అమ్మ‌కునేందుకు సిద్ధం అయ్యాన‌ని చెప్పాడు. దాని కోసం కోర్టు చుట్టూ సైతం తిర‌గాల్సి వ‌చ్చింద‌న్నాడు. అప్పుల వాళ్ల బెదిరింపులు భ‌రించ‌లేన‌ని అందుకే ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని చెప్పాడు. పోలీసులు న‌చ్చ‌జెప్పి అత‌డిని కింద‌కి దించ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది.

Next Story