- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIDEO: ఇన్‌స్టాలో పరిచయం.. లవ్ రిజెక్ట్ చేసిందని రోడ్డుపైనే
బెంగుళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని నవీన్ కుమార్ అనే యువకుడు యువతిపై దాడి చేశాడు. ఈ ఘటన డిసెంబర్ 22న జరగ్గా ప్రస్తుతం సీసీటీవీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: బెంగుళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని నవీన్ కుమార్ అనే యువకుడు యువతిపై దాడి చేశాడు. ఈ ఘటన డిసెంబర్ 22న జరగ్గా ప్రస్తుతం సీసీటీవీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన బెంగుళూరులోని జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రైవేటు పీజీ ముందు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీన్ కుమార్ అనే యువకుడు కారులో వచ్చి యువతిని వేధించడం మొదలుపెట్టాడు. ఆమెపై దాడి చేసి బట్టలు చింపేందుకు ప్రయత్నించాడు.
వీడియోలో ఆమె తలపై యువకుడు కొట్టడం కూడా కనిపిస్తుంది. కాగా యువతి తనకు నిందితుడు 2024లో ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయినట్టు తెలిపింది. అతడి లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసినందుకే అంగీకరించాలని ఒత్తిడి తెచ్చాడని చెప్పింది. గతంలో తాను టెలికాలర్ ఉద్యోగం చేశానని యువకుడి వేధిపులతో అది వదిలేసి వేరే చోటుకు వచ్చానని చెప్పింది. పీజీ మారినా వేధింపులు ఆపకుండా తన వెంట పడుతున్నాడని ఆరోపించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. VIDEO






