- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్‌కు బిగ్ రిలీఫ్.. కొత్త సినిమాలను పైరసీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
కొత్త సినిమాలను పైరసీ(Piracy) చేస్తున్న కిరణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కొత్త సినిమాలను పైరసీ(Piracy) చేస్తున్న కిరణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బడ్జెట్‌తో విడుదలైన సినిమాలని మొదటి రోజే పైరసీ చేస్తున్న ఆంధ్రాకు చెందిన కిరణ్‌కుమార్‌ను బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులు(Cybercrime Police) అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 65 సినిమాలను పైరసీ చేసినట్లు గుర్తించారు. కాగా, సినీ పరిశ్రమకు ఉన్న పెద్ద కష్టాల్లో పైరసీ ఒకటి. ఎన్నో ఏళ్లుగా పైరసీ సినీ పరిశ్రమకు నష్టాలను తెస్తోంది. సినిమా రిలీజయిన రోజే ఫుల్ సినిమా నెట్‌లో వచ్చేస్తుంది. దీనిపై సినీ పెద్దలు ఎప్పట్నుంచో పోరాటం చేస్తున్నారు. మధ్యలో కొన్నాళ్ళు సైలెంట్ అయినా ఇటీవల మళ్ళీ పైరసీ పుంజుకుంటుంది. గేమ్ ఛేంజర్ సినిమా పైరసీ బారిన పడి తీవ్ర నష్టం చూసింది. దీంతో సినీ పరిశ్రమ పెద్దలు పైరసీ తగ్గించడానికి మరోసారి ఫోకస్ పెట్టారు. తాజాగా శ్రీవిష్ణు నటించిన సింగిల్ సినిమా, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కూడా పైరసీ బారిన పడింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెంచారు. వారిని విచారించిన అనంతరం మరికొందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది.






