- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మలక్‌పేట్ కాల్పుల కేసు.. మరో ఐదుగురు నిందితుల గుర్తింపు
మలక్‌పేట (Malakpet)లో కాల్పుల ఘటన కలకలం సృష్టించిన విషయం విదితమే.

దిశ, వెబ్‌డెస్క్: మలక్‌పేట (Malakpet)లో కాల్పుల ఘటన కలకలం సృష్టించిన విషయం విదితమే. శాలివాహననగర్ పార్క్‌లో మార్నింగ్ వాక్ వెళ్లిన సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్ (43)పై గుర్తు తెలియని దండుగులు ఆరు రౌండ్ల పాటు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలో కోల్పోయాడు. అనంతరం కారులో వచ్చిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఘాతుకానికి పాల్పడిన మొత్తం 9 మందిని గుర్తించి అందులో నలుగురిని అరెస్ట్ చేశారు. హత్యకు సహకరించి పరారీలో ఉన్న మరో ఐదుగురి ఆచూకీ కోసం 10 బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. కుంట్లూరు (Kuntloor)లో రాజేష్ (Rajesh) అనే వ్యక్తితో భూతగాదాలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. మరోవైపు వివాహేతర సంబంధం కోణంలోనూ ఆరా తీస్తున్నారు. చందు నాయక్‌పై కాల్పులు జరిపాక నిందితులు చౌటుప్పల్ వైపు వెళ్లినట్లుగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించి నిర్ధారించారు.






