- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TCS మతమార్పిడి కేసులో బిగ్ అప్‌డేట్.. ప్రధాన నిందితురాలు నిదాఖాన్ అరెస్ట్
నాసిక్ టీసీఎస్ మత మార్పిడి, వేధింపుల కేసులో పరారీలో ఉన్న నిదా ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశాన్ని షేక్ చేసిన నాసిక్ టీసీఎస్ (TCS) మత మార్పిడి, వేధింపుల కేసులో 42 రోజులుగా పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు నిదాఖాన్ (Nida Khan)ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. నాసిక్ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), ఛత్రపతి శంభాజీనగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో అర్ధరాత్రి దాటాక ఆమె పట్టుబడ్డారు. నాసిక్ టీసీఎస్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు, బలవంతపు మత మార్పిడికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. బాధితురాలిని బ్రెయిన్ వాష్ చేయడం, మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడం, ఆమె ప్రవర్తన, వస్త్రధారణపై ఆంక్షలు విధించడంలో నిదాఖాన్ కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే, ముందస్తు బెయిల్ కోసం నిదా ఖాన్ చేసిన అభ్యర్థనను నాసిక్ సెషన్స్ కోర్ట్ మే 2న తిరస్కరించింది. ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
దర్యాప్తులో మరిన్ని విషయాలు..
ఈ కేసులో నిదాఖాన్ సోదరుడు డానిష్ షేక్ (Danish Shaikh) సహా మరో ఏడుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మలేషియా (Malaysia) వంటి ఇతర దేశాల సంబంధాలు ఏమైనా ఉన్నాయా..? బాధితురాళ్లను లొంగదీసుకోవడానికి మత్తుమందులు వాడారా.. అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. టీసీఎస్ యాజమాన్యం ఇప్పటికే నిదా ఖాన్‌ను విధుల్లోంచి తొలగించింది. ప్రస్తుతం ఆమెను ట్రాన్సిట్ రిమాండ్ (Transit Remand) ద్వారా నాసిక్‌కు తరలించారు.






