నగరంలో భారీ అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన 6 ఫర్నిచర్ షాపులు

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

నగరంలో భారీ అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన 6 ఫర్నిచర్ షాపులు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) నగర పరిధిలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. తాజాగా నిజాంపేట్‌ (Nizampet)లో అర్ధరాత్రి దాటాక భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాచుపల్లి (Bachupally పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 6 ఫర్నిచర్ షాపులు కాలిబూఢిదయ్యాయి. మంటలకు ఆహుతయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లుగా తెలుస్తోంది.

స్థానిక సమాచారం ప్రకారం.. నిజాంపేట్ ప్రధాన రహదారి పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణాల్లో కలప, కుషన్లు వంటి త్వరగా మండే వస్తువులు ఉండటంతో మంటలు క్షణాల్లోనే పక్కపక్కనే ఉన్న ఆరు షాపులకు విస్తరించాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగను చూసి స్థానికులు భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేరకు ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని పోలీసులు, ఫైర్ అధికారులు అనుమానిస్తున్నారు.

Next Story