వాలంటైన్స్‌ డే రోజున విషాదం.. ప్రేమికులను ఢీ కొట్టిన లారీ.. ఒకరి మృతి

by Ajay Maddhiboyina |

ఏపీలోని కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాలంటైన్స్ డే సందర్భంగా తిరుపతి నుండి ఇద్దరు ప్రేమికులు గండికోటకు బైక్ పై విహారయాత్రకు బయలుదేరారు. అయితే మార్గమధ్యలో వారిని మృత్యువు లారీ రూపంలో వెంటాడింది.

వాలంటైన్స్‌ డే రోజున విషాదం.. ప్రేమికులను ఢీ కొట్టిన లారీ.. ఒకరి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా వాలంటైన్స్ డే సంబురాలు మొదలయ్యాయి. వాలంటైన్స్ వీక్ వచ్చిందంటే ప్రేమికులు ఈ రోజును ఎంతో స్పెషల్ గా జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాక్లెట్ డే, హగ్ డే, టెడ్డీ డే, రోస్ డే పూర్తయ్యాయి. ఇక నేడు వాలంటైన్స్ డే కావడంతో ప్రేమికులు బయటకు వెళ్లడం, నచ్చిన ప్రదేశాలకు వెళ్లి తమ ప్రియమైనవారితో గడపడం లాంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బయటకు వెళ్లిన ఓ జంట జీవితంలో విషాదం నిండింది. ఈ ఘటన ఏపీలోని కడప జిల్లాలో చోటు చేసుకుంది. వాలంటైన్స్ డే సందర్భంగా తిరుపతి నుండి ఇద్దరు ప్రేమికులు గండికోటకు బైక్ పై విహారయాత్రకు బయలుదేరారు. అయితే మార్గమధ్యలో వారిని మృత్యువు లారీ రూపంలో వెంటాడింది. ఇద్ద‌రూ బైక్ పై ఎంతో సంతోషంగా వెళుతున్న స‌మ‌యంలో ఎదురుగా వ‌చ్చిన లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో ప్రియురాలు రిషిక మృతి చెందింది. ప్రియుడికి తీవ్ర‌గాయాలు కావ‌డంతో క‌డ‌ప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Next Story