- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త కళ్లుగప్పి బావతో వివాహేతర సంబంధం.. చివరకు..
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. ఓ మహిళ భర్త సోదరుడితో ప్రేమలో పడింది. వీరిద్దరి మధ్య అట్రాక్షన్ కాస్త శారీరక సంబంధంగా మారింది. కానీ సమాజం కట్టుబాట్లకు వ్యతిరేకంగా కలిసి ఉండలేమని..

X
దిశ, సినిమా : ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. ఓ మహిళ భర్త సోదరుడితో ప్రేమలో పడింది. వీరిద్దరి మధ్య అట్రాక్షన్ కాస్త శారీరక సంబంధంగా మారింది. కానీ సమాజం కట్టుబాట్లకు వ్యతిరేకంగా కలిసి ఉండలేమని.. పాయిజన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆశిష్, అంశిక ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. బైపాస్ దగ్గర ఒక షాపు వద్ద ఆగిన ఇద్దరు.. పాయిజన్ కొని.. భోజనంలో కలుపుకుని తిన్నారని.. ఆ తర్వాత కొంతసేపటికి రోడ్డుపై పడిపోయారని తెలుస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు ప్రకటించారు వైద్యులు. ఈ ఘటన కుటుంబంలో కలకలం రేపింది. పోలీసులు శవాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ సంబంధం కారణంగా ఈ ఆత్మహత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.
Next Story






