- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ.. అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం
లారీ బీభత్సం సృష్టించిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన నెల్లూరు జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: లారీ బీభత్సం సృష్టించిన ఘటనలో మొత్తం ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన నెల్లూరు జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ నగర్ పరిధిలోని చింతారెడ్డిపాలెం సర్కిల్ వద్ద అతివేగంగా చేపల లోడ్‌తో వస్తున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డు వెంట ఉన్న చిరు వ్యాపారుల పైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు మొత్తం ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే, ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.






