అదుపుతప్పి లారీ బోల్తా.. అంతలోనే భయంతో లారీ డ్రైవర్ ఆత్మహత్య

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-12 07:06:00  IST  )

కర్నూలు (Kurnool) జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది.

అదుపుతప్పి లారీ బోల్తా.. అంతలోనే భయంతో లారీ డ్రైవర్ ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు (Kurnool) జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. అదోని (Adoni) మండల పరిధిలోని బైచిగేరి వద్ద లారీ అతివేగంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్‌తో పాటు మొత్తం ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు స్థానికులతో కలిసి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామంతో చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన లారీ డ్రైవర్ తనను పోలీసుల ఎక్కడ ఆరెస్ట్ చేస్తారోనని భయంతో ఆసుపత్రి నుంచి నేరుగా సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి రైలు కింద పడి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story