- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. లేడీ డాన్ ఇంటిని నేలమట్టం చేసిన స్థానికులు
నెల్లూరులో గంజాయి వ్యాపారం చేస్తూ లేడీ డాన్ గా అరాచకాలకు పాల్పడుతున్న అరవ కామాక్షి ఇంటిని స్థానికులు నేలమట్టం చేశారు. గంజాయి వ్యాపారం చేస్తున్న కామాక్షి స్థానిక యువకులను గంజాయికి అలవాటుపడేలా చేయడమే కాకుండా తనకు అడ్డు వచ్చినవారిపై దాడులు చేపిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరులో గంజాయి వ్యాపారం చేస్తూ లేడీ డాన్ గా అరాచకాలకు పాల్పడుతున్న అరవ కామాక్షి ఇంటిని స్థానికులు నేలమట్టం చేశారు. గంజాయి వ్యాపారం చేస్తున్న కామాక్షి స్థానిక యువకులను గంజాయికి అలవాటుపడేలా చేయడమే కాకుండా తనకు అడ్డు వచ్చినవారిపై దాడులు చేపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న స్థానిక కమ్యూనిస్టు నాయకుడు పెంచలయ్యను తన మనుషులతో అతి దారుణంగా నడీరోడ్డుపై హత్య చేయించింది.
దీంతో కామాక్షితో పాటు హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా తాజాగా సోమవారం రాత్రి స్థినికుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. స్థానికంగా ఉంటూ ఇన్నాళ్లు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కామాక్షి ఇంటిని ప్రజలు కూల్చివేశారు. ఆమె ఇంటితో పాటు ఆమె అనుచరుల ఇళ్లను సైతం కూల్చివేశారు. ఇకపై వారిని తమ ప్రాంతానికి కూడా రానివ్వబోమని స్థానికులు హెచ్చరించారు.






