- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్తను వదిలి సహజీవనం.. మహిళను హత్యచేసిన లివిన్ పార్ట్నర్
భర్తను వదిలేసి మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న మహిళ.. తన లివ్ ఇన్ పార్ట్నర్ చేతిలోనే హత్యకు గురైంది.

దిశ, వెబ్‌డెస్క్ : భర్తను వదిలేసి మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న మహిళ.. తన లివ్ ఇన్ పార్ట్నర్ చేతిలోనే హత్యకు గురైంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హొసపేటె పట్టణ పరిధిలో గల రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న చాపలగడ్డ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉమాదేవి (35)కి 13 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ కు చెందిన రఘు అలియాస్ రామాంజనేయులుతో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆరేళ్లుగా ఆమె భర్తకు దూరంగా తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ రైల్వే క్యాటరింగ్ లో పనిచేస్తోంది. నాలుగు నెలల క్రితం ఖాజాహుసేన్ (29)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అతనితో సహజీవనం చేస్తోంది. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా మరోసారి ఇద్దరూ గొడవ పడగా ఖాజాహుసేన్.. ఉమాదేవి గొంతుకోసి హతమార్చాడు. ఈ ఘటనపై చిట్టవాడ్గి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఖాజాహుస్సేన్ ను అరెస్ట్ చేశారు. ఉమాదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.






