- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లివ్ ఇన్ పార్ట్‌నర్‌ను చంపి.. ఆ తర్వాత పక్కనే ఉన్న మంచంపై..
వివాహేతర సంబంధాలు, సహజీవనాలు హత్యలకు దారితీస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: వివాహేతర సంబంధాలు, సహజీవనాలు హత్యలకు దారితీస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో మరో హత్యోదంతం వెలుగుచూసింది. మూడేళ్లుగా ఒక మహిళతో సహజీవనం (Live-in Partner Murder) చేస్తున్న వ్యక్తి.. ఆమెను అతి దారుణంగా హతమార్చాడు. ముత్యాలమ్మపాలెం పంచాయతీ పరిధిలో గల జాలరిపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పరవాడ సీఐ మల్లికార్జునరావు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఒలిశెట్టి కోదండ (40) అనే వ్యక్తికి 8 సంవత్సరాల క్రితం విశాఖనగరం పెదవాల్తేరుకు చెందిన మహిళతో పెళ్లైంది. అతని తీరు నచ్చక ఆమె అతనికి విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. ఆ తర్వాత పూడిమడకకు చెందిన మరొక మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా కోదండ వేధింపుల్ని భరించలేక గర్భంతో ఉండగానే ఆత్మాహుతికి పాల్పడింది. రెండో భార్య ఆత్మహత్య కేసులో కోదండ జైలుకెళ్లారు. బయటకు వచ్చాక ముత్యాలమ్మపాలెంనకు చెందిన ఒక మహిళతో లివిన్ రిలేషన్ షిప్ పెట్టుకున్నాడు. ఆమె అనారోగ్యంతో చనిపోగా.. మూడేళ్ల క్రితం కూలి పనులు చేసుకుంటూ జీవించే లక్ష్మి (45) అనే మహిళతోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. జాలరిపేటలో సహజీవనం చేస్తున్న వీరి మధ్య కొద్దిరోజులుగా మనస్పర్థలు వచ్చాయి.
సెప్టెంబర్ 17 బుధవారం ఉదయం కూడా ఏదో విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. కోదండ క్షణికావేశంలో కూరగాయలు కోసే కత్తితో లక్ష్మిని పలుమార్లు పొడిచి, కర్రతో తలపై కొట్టి చంపేశాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న మంచపై దర్జాగా నిద్రపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కోదండను అరెస్ట్ చేశారు. హత్యకు వాడిన కత్తి, కర్రను స్వాధీనం చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపారు. వీఆర్ఓ అప్పారావు ఫిర్యాదుతో కోదండపై మర్డర్ కేసు నమోదు చేశారు.






