- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యను చంపిన వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష
దిశ, బిజినెపల్లి : భార్యను చంపిన వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఘటన బిజినేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. బిజినేపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్

దిశ, బిజినెపల్లి : భార్యను చంపిన వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఘటన బిజినేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. బిజినేపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ ఉమర్ కూతురైన జహీదా బేగంను రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, ఆలూరు గ్రామస్తుడైన అబ్దుల్ నబి కి ఇచ్చి ఇరు కుటుంబాల పెద్దమనుషుల సమక్షంలో కట్న కానుకలిచ్చి 9 సంవత్సరాల క్రితం పెళ్లి చేశారని వారికి నలుగురు సంతానం. ప్రతిరోజు భర్త తరచుగా అదనపు కట్నం గురించి కొట్టుచుండేవాడని, అట్టి దెబ్బలను తట్టుకోలేక జహీదాబేగం వారి తల్లి గ్రామం బిజినేపల్లికి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆమె భర్త అబ్దుల్ నబీ బిజినేపల్లికి వచ్చి నాది తప్పు నేను ఇప్పటినుంచి మీ బిడ్డను కొట్టను, తిట్టను మంచిగా చూసుకుంటానని నమ్మ బలికి అందరితో పాటు నేను కూడా ఇక్కడే ఉంటానని చెప్పాడు. నాకు కూడా మీరు ఏదైనా పని చూపించమని నమ్మించి 15 రోజుల తర్వాత రాత్రి రెండు గంటలకు భార్యా భర్తలు వారి నలుగురు పిల్లలు కలిసి ఇంట్లో పండుకొని ఉండగా అబ్దుల్ నబీ జహీదా బేగంను కత్తితో తొడ పైన, నడుము పైన నరికి చంపాడు. కేసు సాక్షులను క్రమం తప్పకుండా కోర్టు హెడ్ కానిస్టేబుల్ చిన్నూ నాయక్, కానిస్టేబుల్ రమేష్, అడిషనల్ పి పి హైమద్ అలీ ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో జిల్లా జడ్జి కేసు వివరాలను సాక్షులను అడిగి తెలుసుకొని యావజ్జీవ కారాగారా శిక్ష వేశాడని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.






