చాపిరి గుట్టకు వెళ్తే ప్రాణం పోవాల్సిందే..

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-03-24 11:38:12  IST  )

తాగునీటి కోసం గుట్ట కిందికి వచ్చిన చిరుతపులి పిల్ల వేటగాళ్ల ఉచ్చుకు బలైంది.

చాపిరి గుట్టకు వెళ్తే ప్రాణం పోవాల్సిందే..
X

దిశ, కళ్యాణదుర్గం : తాగునీటి కోసం గుట్ట కిందికి వచ్చిన చిరుతపులి పిల్ల వేటగాళ్ల ఉచ్చుకు బలైంది. తల్లితో సహా రెండు చిరుతలు గుట్ట మీదినుంచి రావడంతో ఈ ఘటన జరిగింది. కళ్యాణదుర్గం మండలంలో వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఫారెస్ట్ అధికారులు విలేఖరులకు వెల్లడించారు.

కళ్యాణదుర్గం మండలంలోని చాపిరి గ్రామ శివారులోని గుట్ట సమీపంలో వేటగాళ్లు కుందేళ్ల కోసం ఉచ్చులు వేసినట్టు అటవిశాఖ అధికారులు గుర్తించారు. అయితే చాపిరి గుట్టపై నుంచి రెండు కూనలతో ఓ చిరుతగా కిందికి దిగగా ఓ చిరుతపిల్ల కుందేళ్ల ఉచ్చులో చిక్కినట్టు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆ చిరుతపిల్ల ఉచ్చునించి తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలను కోల్పోయి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు అంచనాకు వచ్చారు. మరో పిల్లతో చిరుత మళ్లీ గుట్టపైకి వెళ్లినట్టు చెబుతున్నారు. ఎండల పెరగడం వల్ల గుట్టపై నీళ్లు లేకపోవడంతోనే చిరుత కిందికి దిగినట్టు అధికారులు పేర్కొంటున్నారు. సమాచారం అందిన వెంటనే ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన చిరుత పిల్లకు పంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన వేటగాళ్లు పరారీలో ఉన్నారని, వారిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

Next Story