ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రియుడితో పారిపోయిన భార్య.. లాయర్ ఆత్మహత్య

by Sujitha Rachapalli |

* ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రియుడితో పారిపోయిన భార్య.. * విషయం తెలిసి కుమిలిపోయిన భర్త ఆత్మహత్య * నేను చనిపోయాక నా బిడ్డలను..

ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రియుడితో పారిపోయిన భార్య.. లాయర్ ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ కంటోన్మెంట్ ప్రాంతంలోని చనేహతిలో విషాదం చోటు చేసుకుంది. భార్య ప్రియుడితో పారిపోయిందని ఆత్మహత్య చేసుకున్నాడు యువ న్యాయవాది. కమల్ సాగర్‌కు కోమలితో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా కోమలి ఈ మధ్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. షామ్లీ నివాసి అయిన విశాల్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతోంది. ఉన్నట్లుండి ఇద్దరు పిల్లలను తీసుకుని అతనితో పారిపోయింది. ఈ విషయం తెలిసిన భర్త.. మానసికంగా కుంగిపోయాడు. ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య, ఆమె ప్రియుడు తన చావుకు బాధ్యులని సూసైడ్ నోట్‌లో పేర్కొన్న కమల్.. తన ఇద్దరు పిల్లలను తల్లికి అప్పగించకూడదని కోరాడు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.

Next Story