కర్నూలు బస్సు యాక్సిడెంట్.. కావేరి ట్రావెల్స్ యజమాని అరెస్ట్

by Kema Shiva Kumar |

కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో మొత్తం 19 మంది సజీవ దహనమైన ఘటన తెలిసిందే.

కర్నూలు బస్సు యాక్సిడెంట్.. కావేరి ట్రావెల్స్ యజమాని అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో మొత్తం 19 మంది సజీవ దహనమైన ఘటన తెలిసిందే. ఈ కేసులో తాజాగా వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని వేమూరి వినోద్‌ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అయితే, వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు.. రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ బస్సు రిజిస్ట్రేషన్‌ పత్రాలు సరిగా లేవని.. సీటర్‌ వాహనాన్ని స్లీపర్‌గా మార్చినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా, బస్సు ప్రమాదానికి సంబంధించి బస్సు డ్రైవర్‌, యజమానిపై కేసు నమోదైంది. ఇప్పటికే కేసులో A1‌గా ఉన్న డ్రైవర్‌ లక్ష్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Next Story