కర్నూల్ బస్సు ప్రమాదం.. డ్రైవర్ అరెస్ట్

by Ajay Maddhiboyina |

కర్నూల్ బస్సు ప్రమాదంలో నింధితుడిగా ఉన్న డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో లక్ష్మయ్య ఏ1గా ఉన్నాడు. ఏ2గా కావేరీ ట్రావెల్స్ యజమాని ఉండగా ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. పోలీసులు యజమాని కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 24న కర్నూల్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

కర్నూల్ బస్సు ప్రమాదం.. డ్రైవర్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూల్ బస్సు ప్రమాదంలో నింధితుడిగా ఉన్న డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో లక్ష్మయ్య ఏ1గా ఉన్నాడు. ఏ2గా కావేరీ ట్రావెల్స్ యజమాని ఉండగా ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. పోలీసులు యజమాని కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 24న కర్నూల్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది.

ఓ బైక్‌ను ఢీ కొట్టి కొద్దిదూరం వరకు ఈడ్చుకెళ్లడంతో అగ్గి రాజుకుని బస్సుకు నిప్పంటుకుంది. ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయ్యారు. మిగితావాళ్లు ఎమర్జెన్సీ విండో పగలగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు. చనిపోయినవారి డెడ్ బాడీలను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదంలో బైకర్ కూడా మరణించగా బస్సు డ్రైవర్ వాంగ్మూలం కీలకంగా మారే అవకాశం ఉంది.

Next Story