- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండాపూర్ రేవ్ పార్టీ సూత్రధారి అశోక్ కుమార్ అరెస్ట్.. కారుకు ఎంపీ స్టిక్కర్ వేసుకుని చక్కర్లు
కొండాపూర్ (Kondapur)లోని ఎస్‌వీ నిలయం (SV Nilayam) సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ కలకలం రేపిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కొండాపూర్ (Kondapur)లోని ఎస్‌వీ నిలయం (SV Nilayam) సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఆ పార్టీ కీలక సూత్రధారి అయిన అప్పికట్ల అశోక్ కుమార్‌ను ఇవాళ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు అతడి నుంచి డ్రగ్స్, గంజాయి, కండోమ్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే అశోక్ కుమార్ మెయిన్ టార్గెట్ అని తెలుస్తోంది. అదేవిధంగా తనపై ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా.. కారుపై లోక్‌సభకు నామినేట్ అయిన ఓ ఎంపీ స్టిక్కర్‌ను అంటించుకుని తిరుగుతున్నట్లుగా విచారణలో వెల్లడైంది.
కాగా, శనివారం రాత్రి కొండాపూర్‌లోని ఎస్‌వీ నిలయంలో సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ మేరకు మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్‌లో డబ్బున్న వాళ్లను హైదరాబాద్ (Hyderabad)కు తీసుకొచ్చి.. ప్రతి వీకెండ్‌లో ఎంజాయ్ చేయించి తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు వారి నుంచి 2 కిలోల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, 1.91 గ్రాముల డ్రగ్స్ (Drugs) స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కింగ్‌కెన్ షేర్ రాహుల్, ఆర్గనైజర్లు ప్రవీణ్ కుమార్, సమ్మెల సాయి కృష్ణ, హిట్ జోసఫ్, తోట కుమార స్వామి, అడపా యశ్వంత్, శ్రీదత్, నంద, సమతా, తేజ ఉన్నారు.






