- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడేళ్లలో రూ.13 కోట్లు సంపాదన.. ఐబొమ్మ రవి కన్ఫెషన్ రిపోర్ట్‌లో కీలక అంశాలు
ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. కాగా రవి కన్ఫెషన్ రిపోర్టులో కీలక అంశాలను వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. కాగా రవి కన్ఫెషన్ రిపోర్టులో కీలక అంశాలను వెల్లడించారు. మూడేళ్లలో రవి రూ.13 కోట్లు సంపాదించినట్టు అధికారులు గుర్తించారు. విలాసాల కోసం రూ.10 కోట్లు ఖర్చు చేసినట్టు గుర్తించారు. అంతే కాకుండా రవి బ్యాంక్ అంకౌట్ లో రూ.3 కోట్లు ఉండగా వాటిని పోలీసులు ఫ్రీజ్ చేశారు. కేవలం ఫైల్ స్టార్ హోటల్స్ లోనే బస చేస్తూ రవి లగ్జరీ జీవితాన్ని గడిపినట్టు పోలీసుల విచారణలో తేలింది. 2007లో రవి తన స్నేహితుల సర్టిఫికెట్లను దొంగలించినట్టు తేలింది. అంజయ్య, ప్రహ్లాద్, కాళీ ప్రసాద్ అనే ఐడీలతో అతడు ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసినట్టు విచారణలో తెలిసింది. అంతే కాకుండా వెబ్ డిజైనర్ అయిన రవి సప్లయిర్ ఇండియా, హాస్పిటల్ INN.. ER ఇన్ఫోటెక్ సంస్థలను స్థాపించినట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే రవి ఐబొమ్మ వెబ్ సైట్ లో పైరసీ సినిమాలు హెడ్ డీ క్లారీటీతో అప్ లోడ్ చేస్తూ చిత్రపరిశ్రమకు ఎంతో నష్టం కలిగించాడు.






