- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేధా స్కూల్‌లో ప్రమాదకర పరిస్థితులు.. ఒకవైపు బుక్స్ మరోవైపు డ్రగ్స్, ఇంకోవైపు రియాక్టర్లు
బోయిన్‌పల్లి అల్ఫాజోలం కేసు(Boinpalli Alfazolam Case)లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి అల్ఫాజోలం కేసు(Boinpalli Alfazolam Case)లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేధా స్కూల్(Medha School)లో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్కూల్ మొదటి అంతస్తులో 8 రియాక్టర్లు, అంతేగాకుండా ఒకవైపు పిల్లల పుస్తకాలు, మరోవైపు డ్రగ్స్, రసాయనాలను గుర్తించారు. ఫ్యాక్టరీని తలపించేలా స్కూల్ నిర్వహణ ఉండటంతో అధికారులు సైతం షాక్ అయ్యారు. దీంతో స్కూల్ యజమాని జయప్రకాశ్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్, రియాక్టర్లు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ద్వారా వచ్చిన రూ.20 లక్షలను సైతం సీజ్ చేశారు. కాగా, డ్రగ్స్‌ను నియంత్రించేందుకు తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఈగల్ టీం శనివారం బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలోని మూతపడిన మేధా పాఠశాలలో దాడులు నిర్వహించింది. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించిన ఈగల్ టీం అధికారులు పాఠశాలలో అల్ఫాజోలం తయారు చేసే యంత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మరింత లోతుగా దర్యాప్తు చేయగా, మత్తు పదార్థాలు, రియాక్టర్లు బయటపడ్డాయి.






