- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్యం వికటించి వ్యక్తి మృతి
by Bhanu |
వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది.

X
దిశ, పాలకుర్తి: వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన పొన్నం పాండు రంగయ్య(75) కడునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు తొర్రూరు పట్టణ కేంద్ర సుప్రీత ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే.. రంగయ్యను పరిశీలించిన వైద్యులు ఇంజెక్షన్లు వేయగా కొద్ది సమయంలో అవి వికటించి మృతి చెందాడని తెలిపారు.
మృతికి కారణమైన వైద్యులు, ఆసుపత్రిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని మృతదేహంతో ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు,బంధువులు ఆందోళన చేయగా విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇవ్వగా అక్కడ నుండి వెళ్ళారు.
Next Story






