పిన్ని కుమారుడితో అక్రమ సంబంధం.. సుపారీ ఇచ్చి మరి..

by Sathputhe Rajesh |   (  Updated:2023-02-14 09:24:54  IST  )

అక్రమ సంబంధాలు మానవ సంబంధాలను ఖూనీ చేస్తున్నాయి.

పిన్ని కుమారుడితో అక్రమ సంబంధం..  సుపారీ ఇచ్చి మరి..
X

దిశ, వెబ్‌డెస్క్: అక్రమ సంబంధాలు మానవ సంబంధాలను ఖూనీ చేస్తున్నాయి. వావి వరుసలు లేకుండా పిన్ని కుమారుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత కట్టుకున్న భర్తను అంతమొందించేందుకు సుపారీ ఇచ్చి మరి హత్య చేయించింది. ఈ దారుణ ఘటన కర్ణాటక లోని తుమకురు జిల్లాలోని కుణిగల్ తాలూకాలో సీనప్పన హళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంజునాథ్ హత్యకు అతని భార్య హర్షిత(20) రూ.రూ.5లక్షల సుపారీ ఇచ్చింది.

మంజునాథ్ ఫిబ్రవరి 3న అర్థరాత్రి ఫోన్ రావడంతో మాట్లాడుతూ బయటికి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకోలేదు. రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న మంగళ చెరువులో మంజునాథ్ శవమై తేలాడు. దీంతో మంజునాథ్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి భార్య హర్షితను అరెస్ట్ చేశారు. ఆమె చెప్పిన వివరాలో హత్యకు పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆమెను, ఆమె పిన్ని కుమారుడు రఘ, అతని మిత్రుడు రవికిరణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య చేసి చెరువులో పడేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story