- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడుంబా రవాణా చేస్తున్న ఆటో పట్టివేత.. ఇద్దరు అరెస్ట్..
by Bhanu |
పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గురువారం గుడుంబా అక్రమ రవాణాపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.

X
దిశ, పరకాల : పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గురువారం గుడుంబా అక్రమ రవాణాపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఆత్మకూరు మండలం కటాక్షపూర్ వద్ద ఎస్సై సులోచన ఆధ్వర్యంలో నిర్వహించిన రూట్ వాచ్ సమయంలో నందిగామ రేలకుంట గ్రామం నుంచి ఆటోలో గుడుంబా రవాణా చేస్తూ వస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.
నిందితులుగా గుర్తించిన భూక్యా సుజాత, భూక్యా జగన్ వద్ద నుండి సుమారు 15 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. రవాణా కోసం ఉపయోగించిన ఆటోను కూడా అధికారులు సీజ్ చేశారు. ఈ గుత్తు చేసే దాడిలో కానిస్టేబుళ్లు శ్రీనివాస్, విజయ్ కుమార్, దిలీప్‌లు పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ తరఫున గుడుంబా నిర్మూలనకు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్సై తెలిపారు.
Next Story






