- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IED Blast: బీజాపూర్ జిల్లాలో పేలిన ఐఈడీ.. స్పాట్‌లోనే ఇద్దరు చిన్నారులు మృతి
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భద్రత దళాల కోసం మావోయిస్టులు (Maoists) ఏర్పాటు చేసిన ఐఈడీ ట్రాప్ (IED Trap)లోకి తల్లితో పాటు చిన్నారులు వెళ్లగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా.. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామస్థులు ఆ మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సుక్మా జిల్లా గోగుండాకొండ (Gogundakonda)పై ఉపంపల్లి (Upampally) ప్రాంతంలో శనివారం ఉదయం నుంచి మావోయిస్టులకు భద్రతా బలగాలకు భీకరంగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు మొత్తం 17 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ కూబింగ్‌లో డీఆర్జీ (DRG), సీఆర్‌పీఎఫ్ (CRPF) జవాన్లు సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ మేరకు ఎన్‌కౌంటర్ (Encounter) జరిగిన ప్రాంతంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.






