చంచల్‌గూడ జైలు నుంచి iBOMMA రవి విడుదల

by Ajay Maddhiboyina |

పైర‌సీ సినిమాల వెబ్ సైట్ ఐబొమ్మ నిర్వాహ‌కుడు ఇమ్మంది ర‌వి చంచ‌ల్ గూడ జైలు నుండి విడుద‌ల‌య్యారు. మంగ‌ళ‌వారం కోర్టు ర‌వికి బెయిల్ మంజూరు చేయ‌గా నేడు బ‌య‌ట‌కు వ‌చ్చాడు.

చంచల్‌గూడ జైలు నుంచి iBOMMA రవి విడుదల
X

దిశ‌, వెబ్ డెస్క్: పైర‌సీ సినిమాల వెబ్ సైట్ ఐబొమ్మ నిర్వాహ‌కుడు ఇమ్మంది ర‌వి చంచ‌ల్ గూడ జైలు నుండి విడుద‌ల‌య్యారు. మంగ‌ళ‌వారం కోర్టు ర‌వికి బెయిల్ మంజూరు చేయ‌గా నేడు బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఐబొమ్మ వెబ్ సైట్ ద్వారా సినిమాల‌ను పైర‌సీ చేస్తున్న కార‌ణంగా ర‌విని మూడు నెల‌ల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ త‌ర‌వాత ప‌లుమార్లు క‌స్ట‌డీలోకి తీసుకుని విచారించారు. విచార‌ణ‌లో కీల‌క అంశాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ర‌వి ఐలాండ్ నుండి పైర‌సీ సినిమాల వెబ్ సైట్ ను నిర్వ‌హిస్తున్నాడ‌ని తేలింది.

అంతేకాకుండా ర‌వి ఏపీకి చెందిన వ్య‌క్తేన‌ని పోలీసులు గుర్తించారు. భార్య‌తో విడాకులు తీసుకున్నట్టు సైతం విచార‌ణ‌లో తేలింది. అక్ర‌మ సంపాద‌న కోస‌మే సినిమాల‌ను పైర‌సీ చేయ‌గా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు వేల కోట్లు న‌ష్టం వాటిల్లిన‌ట్టు పోలీసుగు గుర్తించారు. ర‌వి పైర‌సీ సినిమాల ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోట్ చేస్తూ కోట్లు సంపాదించిన‌ట్టు గుర్తించారు. ఇక ర‌వి జైలుకు వెళ్లిన నాటి నుండి అనేక‌సార్లు బెయిల్ కోసం ప్ర‌య‌త్నించ‌గా ఎట్ట‌కేల‌కు ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చాడు.

Next Story