- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముషీరాబాద్ యువతి హత్యకేసు అప్డేట్.. తల్లిదండ్రులతో గుడికి వెళ్లిందని!
హైదరాబాద్ ముషీరాబాద్ లో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. బాపూజీగనర్ లో నివాసం ఉంటున్న పవిత్ర అనే యువతిని ఆమె మేనబావ ఉమాశంకర్ కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ముషీరాబాద్ లో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. బాపూజీగనర్ లో నివాసం ఉంటున్న పవిత్ర అనే యువతిని ఆమె మేనబావ ఉమాశంకర్ కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. అయితే ఘటనకు సంబంధించి బాధితురాలి మేనత్త షాకింగ్ నిజాలు వెల్లడించింది. ఉమాశంకర్ తల్లిదండ్రులు చనిపోతే తమ అన్న, పవిత్ర తండ్రే చేరదీశాడని చెప్పింది. పవిత్రకు ఉమాశంకర్ అంటే ప్రాణం అని ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని తెలిపింది. కానీ ఉమాశంకర్ కు పవిత్రపై అనుమానం అని ఆమెను ఎక్కడకీ వెళ్లనివ్చేవాడు కాదని వెల్లడించింది.
అనుమానంతోనే ఇంటర్ లోనే పవిత్రను చదువుమాన్పించాడని తెలిపింది. పవిత్ర తల్లిదండ్రులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లిందని, అయితే వెళ్లేముందు ఉమాశంకర్ వద్దని హెచ్చరించాడని తెలిపింది. అయినప్పటికీ తల్లిదండ్రులతో కలిసి గుడికి వెళ్లింది అనే కోపంతో వచ్చి గొడవకు దిగాడని చెప్పింది. ఇద్దరి మధ్య గొడవ జరగటంతో ఉమాశంకర్ ను పెళ్లి చేసుకోను అని పవిత్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని, ఈ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న కత్తితో హత్య చేశాడని చెప్పింది. ఇంట్లోకి కత్తితో వచ్చాడని తెలియదని, పవిత్ర తల్లి చెల్లి ఇంట్లో ఉండగానే దాడి చేశాడని తెలిపింది.






