నాంపల్లిలో దారుణం.. వ్యక్తిపై దాడి చేసి హత్య

by Bhanu |   (  Updated:2025-05-15 16:45:16  IST  )

ఓ వ్యక్తిపై గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి నడిరోడ్డుపై కత్తులతో ,బ్యాట్ తో దాడి చేసి హత్య చేసిన ఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

నాంపల్లిలో దారుణం.. వ్యక్తిపై దాడి చేసి హత్య
X

దిశ, కార్వాన్: ఓ వ్యక్తిపై గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి నడిరోడ్డుపై కత్తులతో ,బ్యాట్ తో దాడి చేసి హత్య చేసిన ఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నారాయణరెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. చంద్రాయణ గుట్ట ఫూల్ బాగ్ హఫీజ్ బాబా నగర్ ప్రాంతానికి చెందిన అయాన్ ఖురేషి (20) . అయితే ఖురేషి 17 సంవత్సరాల వయసులో బంధువు బావను 2020లో కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్య కేసులో జూవేనల్ నిందితుడు. కాగా గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జువెనల్ కోర్టుకు హాజరై తిరిగి ఇంటికి రెడ్ హిల్స్ ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆసుపత్రి ముందు నుంచి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మరో ద్విచక్ర వాహనంపై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి కత్తులతోపాటు బ్యాట్ తో దాడి చేసి నడిరోడ్డుపై హత్య చేసి పారిపోయారు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. క్లూస్ టీం కూడా వచ్చి దర్యాప్తు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. ఖురేషి ని హత్య చేసిన వారు బంధువులే అయి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. కాగా వరుస హత్యలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ హత్య స్థానికంగా కలకలం సృష్టించడంతో భయాందోళనలలో స్థానికులు ఉన్నారు.

Next Story