Hyderabad: వదినతో అక్రమసంబంధం..భార్యను హత్య చేసిన భర్త?

by Ajay Maddhiboyina |

హైద‌రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. క‌ట్టుకున్న భ‌ర్తే భార్య పాలిట కాల య‌ముడయ్యాడు. భార్య‌ను కొట్టిచంపి గుండెపోటుతో మ‌ర‌ణించింద‌ని చెప్పాడు.

Hyderabad: వదినతో అక్రమసంబంధం..భార్యను హత్య చేసిన భర్త?
X

దిశ‌, వెబ్ డెస్క్: హైద‌రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. క‌ట్టుకున్న భ‌ర్తే భార్య పాలిట కాల య‌ముడయ్యాడు. భార్య‌ను కొట్టిచంపి గుండెపోటుతో మ‌ర‌ణించింద‌ని చెప్పాడు. వివరాల్లోకి వెళితే.. హైద‌రాబాద్‌కు చెందిన అనిల్‌కు సాహితి అనే యువ‌తితో వివాహం జ‌రిగింది. సాహితి సోద‌రితో కూడా అనిల్ వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్ర‌మంలో గొడ‌వ‌లు జ‌ర‌గ‌డంతో సాహితిని హ‌త్య చేశాడ‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు.

మొద‌ట అనిల్ త‌న భార్య గుండెపోటుతో చ‌నిపోయింద‌ని చెప్ప‌గా మృత‌దేహంపై గాయాలు ఉండ‌టంతో కుటుంబ స‌భ్యులు హ‌త్య‌గా భావించి పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదు చేశారు. త‌న కూతుళ్లు ఇద్ద‌రినీ అనిల్ ట్రాప్ చేశాడ‌ని సాహితి త‌ల్లి చెబుతోంది. ఇద్ద‌రు కూతుళ్ల‌ను టార్చ‌ర్ చేశాడని ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. పెద్ద కూతురును సైతం చంపేస్తాన‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్టు తెలిపింది. ఎక్క‌డ ఉన్నా చంపేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చాడ‌ని చెప్పింది. గ‌తంలో కూడా సాహితిని వేధించాడ‌ని ఇంటికి తీసుకువెళ‌తామ‌ని చెప్ప‌డంతో అడ్డుప‌డి చేయి కోసుకున్నాడ‌ని తెలిపింది. చివ‌రికి కొట్టి త‌న కూతురును లేకుండా చేశాడ‌ని క‌న్నీళ్లు పెట్టుకుంది. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

Next Story