- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రంకన్ డ్రైవింగ్ పై పోలీసుల చార్జీషీట్.. 1.14 కోట్లు జరిమానా..
డ్రంకన్ డ్రైవింగ్ చేస్తున్న మందుబాబు చర్య పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిపై చట్ట పరంగా శిక్షలు పడేందుకు చార్జీషీట్ లను కోర్టులలో దాఖలు చేస్తున్నారు.

X
దిశ, సిటీక్రైం : డ్రంకన్ డ్రైవింగ్ చేస్తున్న మందుబాబు చర్య పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిపై చట్ట పరంగా శిక్షలు పడేందుకు చార్జీషీట్ లను కోర్టులలో దాఖలు చేస్తున్నారు. జూన్ నెలలో డ్రంకన్ డ్రైవింగ్ కేసులలో 3353 మందుబాబుల పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 5321 చార్జీషీట్ లను కోర్టులో దాఖలు చేశారు.
వీటిని విచారించిన కోర్టు 1.14 కోట్ల రూపాయాల జరిమానాను విధించింది. 133 మందికి జైలు శిక్షలను ఖరారు చేస్తు తీర్పును ఇచ్చింది. 3-14రోజులు, 2-10 రోజులు, ఒక రోజు నుంచి ఆరు రోజుల వరకు 128 మంది మందుబాబులకు కోర్టు తీర్పుతో జైలు శిక్షలు పడ్డాయి. మద్యం సేవించి వాహనాలను నడిపే వారి పై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ జోయెల్ డేవిస్ హెచ్చరించారు.
Next Story






