భర్త పైశాచికత్వం.. భార్య యోనిని ఫెవిక్విక్‌తో అంటించి దారుణంగా..!

by Bhoopathi Nagaiah |

మూడుముళ్ల బంధంతో ఏడడుగులు వేసి కాపురానికి వచ్చిన మహిళకు నరకం చూపించాడో భర్త.

భర్త పైశాచికత్వం.. భార్య యోనిని ఫెవిక్విక్‌తో అంటించి దారుణంగా..!
X

దిశ, వెబ్‌డెస్క్ : మూడుముళ్ల బంధంతో ఏడడుగులు వేసి కాపురానికి వచ్చిన మహిళకు నరకం చూపించాడో భర్త. నచ్చినన్ని రోజులు సంసారం చేసి ఆపై మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడా ప్రబుద్దుడు. అంతేనా.. ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకోని వచ్చి ఇంట్లోనే కాపురం పెట్టాడు. ఈ దారుణాన్ని ప్రశ్నించినందుకు ఆమెపై పైశాచికంగా దాడి చేయడంతోపాటు ప్రైవేట్ పార్ట్‌లో ఫెవిక్విక్ పోశాడు. ఈ అమానూష ఘటన బిహార్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

జముయి పట్టణానికి చెందిన సర్ధార్ ఎనిమిదేళ్ల క్రితం ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లు బాగానే సంసారం చేసిన సర్దార్ ఇటీవల మరో మహిళలో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి భార్యను చీటికిమాటికి తిడుతూ, కొడుతూ వస్తున్నాడు. అయినా భార్య భరించింది. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం సర్దార్ తన ప్రియురాలిని పెళ్లి చేసుకోని వచ్చాడు. తను రెండోపెళ్లి చేసుకున్నానని, ఇకపై తను కూడా ఈ ఇంట్లోనే ఉంటుందని మొదటి భార్యకు తెగేసి చెప్పాడు. అంతేకాక అప్పటి నుంచి రెండో భార్యతో కలిసి మొదటి భార్యపై దాడి చేయడం, తిట్టడం తీవ్రతరం చేశాడు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం ఆ ఇద్దరు కలిసి మొదటి భార్యపై దాడి చేయడంతోపాటు ఆమె యోనిలో ఫెవిక్విక్ పోసి దారుణానికి తెగబడ్డారు. ఈ ఘటనతో ఆమె ప్రైవేట్ పార్ట్ కాలిపోవడంతోపాటు తీవ్రగాయం అయింది. స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు స్వల్ప శస్త్రచికిత్స చేసి ఫెవిక్విక్‌ను తొలగించారు. మొదటి భార్య ఫిర్యాదు మేరకు జముయి పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది పాత ఘటనగా తెలుస్తుంది. కొందరు కావాలనే వార్త క్లిప్‌లను లేటెస్ట్‌గా వైరల్ చేస్తున్నట్టు నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.

Next Story